ట్విటర్‌లో ఎక్కువ పోస్టింగ్స్ చేస్తే ఆదాయం
ట్విటర్‌లో చేసే పోస్టింగుల ద్వారా యూజర్లు ఆదాయం సంపాదించే ఛాన్స్ ట్విటర్ అధినేత ఎలాన్‌మస్క్ కల్పిస్తున్నారు. కంటెంట్, వీడియోలు ట్విటర్‌లో పోస్టు చేయడం ద్వారా యూజర్లు డబ్బు సంపాదించవచ్చని మస్క్ వెల్లడించారు. సుదీర్ఘ సమాచారం గల కంటెంట్లను పోస్టు చేసి సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను పెట్టుకుని ఆదాయం ఆర్జించుకోవచ్చని, సెట్టింగ్స్‌లోని మానిటైజ్ ఆప్షన్‌ను ఎంచుకోమని పేర్కొన్నారు. ఇలా సంపాదించిన యూజర్ల నుండి 12 నెలల పాటు ట్విటర్ రుసుము తీసుకోమన్నారు. ఈ వెసలుబాటు వల్ల ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు మస్క్. అయితే ఇది ప్రస్తుతం అమెరికాలో మాత్రమే వినియోగించవచ్చని, త్వరలోనే ఇతరదేశాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు.


 
							 
							