‘ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారు’..బాబు
ఏపీలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలకు భరోసా కలిగిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో సభ్యులకు వివరించారు. గతంలో ఎన్నడూ లేని మెజారిటీతో ప్రజలు తీర్పు ఇచ్చారని, ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని ఆనందం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని హెల్తీ, వెల్తీ, ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీనిని రూపొందించినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పులు పరాకాష్టకు చేరాయని, తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు వారి వారి నియోజక వర్గాల పరిధిలో విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేయాలని, ప్రజలకు సేవ చేస్తే ప్రతీ నియోజక వర్గంలోని వారు మనకు సపోర్ట్ చేస్తారని పేర్కొన్నారు. తాను ఐదవసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు.


 
							 
							