Andhra PradeshHome Page Slider

‘దమ్ముంటే జగన్‌తో దీక్ష చేయించు’.. బీజేపీ నేత సవాల్

పవన్ కళ్యాణ్ దీక్షపై, వేషభాషలపై విమర్శలు చేసిన భూమన కరుణాకర రెడ్డిపై బీజేపీ నేత భాను ప్రకాశ్ సవాల్ చేశారు. మీకు దమ్ముంటే జగన్‌తో దీక్ష చేయించగలరా? అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను దొంగస్వామి అని, సూడో స్పిరిచ్యువలిస్ట్ అని ఆరోపణలు చేసిన భూమన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాషాయం కట్టి దొంగభక్తి ప్రకటిస్తున్నాడని, సనాతన ధర్మం గురించి అసలు పవన్‌కేమీ తెలియదని విమర్శించడం చాలా పొరపాటన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జగన్ ఇంట్లో ఎప్పుడైనా పూజలు చేయించే సత్తా భూమనకు ఉందా అని ప్రశ్నించారు. జగన్‌కు ఏమాత్రం హిందూమతంపై విశ్వాసం లేదని, గౌరవించడని విమర్శించారు. అందుకే తిరుమలకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇమ్మంటే వెళ్లడమే మానుకున్నాడని పేర్కొన్నారు.