Home Page SliderTelangana

లింక్ క్లిక్ చేస్తే డబ్బులు మాయం

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ప్లాన్ వేశారని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ‘ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది. న్యూ ఇయర్ విషెస్ ఫొటోలు, మెసేజ్ లను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే మీ పని అయిపోయినట్టే. ఆండ్రాయిడ్ ప్యాకేజీకిట్ (ఏపీకే) ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. కాబట్టి నూతన సంవత్సర మెసేజెస్ విషయంలో అలర్ట్ గా ఉండాలి’ అని సూచించారు.