థామ్సన్ టీవీ కొంటే.. OTT యాప్స్ ఫ్రీ
ఫ్రెంచ్ కన్జూమర్ అప్లయెన్సెస్ బ్రాండ్ థామ్సన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, స్పీకర్లపై భారీ డీల్స్ ఇస్తామని ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్ల కోసం ఈ నెల 26 నుంచి పది రోజులపాటు ఇవి అందుబాటులో ఉంటాయి. థామ్సన్ టీవీలు కొంటే డిస్కౌంట్లతోపాటు సోనీలివ్, జీ5 వంటి 27 ఓటీటీ యాప్స్ కు మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ఉచితంగా దక్కించుకోవచ్చు. థామ్సన్ టాప్ లోడ్ పుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మోడల్ రూ. 12,999లకు లాంచ్ చేస్తామని థామ్సన్ ప్రకటించింది. ఇటీవల ఆల్ఫాబీట్ 25, ఆల్ఫాబీట్ 60 పేరుతో రెండు ఫ్లాగ్ షిప్ సౌండ్ బార్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి తెచ్చామని తెలిపింది. వచ్చే ఆరు నెలల్లో 20కి పైగా మోడళ్లను విడుదల చేసేందుకు థామ్సన్ సన్నాహాలు చేస్తోంది.