‘మేం కట్టిన ఇళ్లకు మీరు సున్నాలు వేస్తున్నారంతే’..కేటీఆర్
బీఆర్‌ఎస్ హయాంలో కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సున్నాలు వేసేసి, ఇందిరమ్మ ఇళ్లంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ ముద్ర అడుగడుగునా ఉందని, దానిని చెరిపేయడం రేవంత్ రెడ్డి వల్ల కాదన్నారు. మీరు కేవలం సున్నాలు వేసే సన్నాసి బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలందరికీ సొంత ఇళ్ళు ఉండాలని కలలు కన్నారని, ఆ ఉద్దేశంతోనే పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించారని పేర్కొన్నారు.