‘మనకు ఒకరి ప్రేమ దక్కితే మనమూ తిరిగి ప్రేమించాలి’..పీవీ సింధు
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. కాగా నేడు ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఈడీ వెంకట దత్తసాయితో ఉంగరాలు మార్చుకుని వివాహం నిశ్చయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘ఒకరి ప్రేమ మనకు దక్కితే తిరిగి మనమూ ప్రేమించాలి’ అంటూ పేర్కొంటూ తమ ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేశారు. దీనితో పాటు కాబోయే భర్తతో కేక్ కట్ చేస్తున్నఫోటోను కూడా షేర్ చేశారు. వీరి వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లోని ప్యాలస్‌లో జరగనుంది.