Home Page SliderNational

ఢిల్లీకి నీరివ్వకపోతే నిరాహారదీక్షకు దిగుతాం.. ప్రధానికి లేఖ రాసిన అప్ మంత్రి

ఢిల్లీ నీటి సంక్షోభానికి పరిష్కరం చూపించాలని, ఢిల్లీకి నీరివ్వకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని అప్ మంత్రి అతిషీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. హర్యానా రాష్ట్రం ఢిల్లీకి రావలసిన నీటిని విడుదల చేయడం లేదని, దీనివల్ల ఢిల్లీలో తాగునీటి కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. నిన్న 613 ఎంజీడీల నీరు రావలసి వస్తే కేవలం 513 ఎంజీడీలు మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికే హీట్ వేవ్‌ను ఎదుర్కొంటున్నారని, దీనికి తోడు నీటి ఎద్దడి కూడా దానికి తోడయ్యిందని పేర్కొన్నారు. హర్యానా ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని, కేంద్రప్రభుత్వం జోక్యం కలిగించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ అప్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఢిల్లీలో ఈ పరిస్థితి వచ్చిందని, నీటి చౌర్యం, బ్లాక్ మార్కెటింగ్ నుండి దృష్టి మరల్చడానికే ఢిల్లీ జలవనరుల మంత్రి నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. హర్యానా నుండి ఢిల్లీకి రావలసిన జలాలను రప్పిస్తున్నామని, నిన్న డిల్లీకి మిగులు జలాలు వచ్చాయని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అయినా అప్ మంత్రి డ్రామాలాడుతోందని విమర్శించారు.