Home Page SliderTelangana

మరోసారి మోసపోతే ఆగమైపోతాం… స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో కిషన్ రెడ్డి

బషీర్ బాగ్ లో జరిగిన “ప్రజా గోస – బీజేపీ భరోసా” స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఎలాంటి హామీ లేకుండా ప్రధాని నరేంద్రమోదీ, ప్రతి పేదబిడ్డకు కేవలం ఆధార్ కార్డ్ తో అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారని.. దీని వల్ల 45 కోట్ల అకౌంట్లు దేశంలో ఓపెన్ అయ్యాయన్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్రాలకు 100 రూపాయలు పంపిస్తే పేదలకు 15 రూపాయలు మాత్రమే చేరేవని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానియే చెప్పారు ఇది నేను చెప్తుంది కాదు గతంలో రాజీవ్ గాంధీ గారే చెప్పారన్నారు. అందుకే దళారీ వ్యవస్థ, పేదవారిని దోపిడీ చేసే వ్యవస్థకు చరమగీతం పాడి ప్రతి పైసా నేరుగా సామాన్యులకు చేరాలని ప్రధాని మోడీ అకౌంట్ లు ఓపెన్ చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం మోదీ సహాయంతో పక్కన ఉన్న ఏపీలో లక్షల ఇళ్లు కడితే మన రాష్ట్రంలో వేల ఇళ్లు కూడా కట్టలేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పీడ విరగడ కావాలి అరాచక పాలన చేస్తున్న కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టిన శని, శాపమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వద్దని చెప్పి… కేసీఆర్ నేడు కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని… కేసీఆర్ ఫ్యామిలీ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలన్నారు. నిజాం పరిపాలనను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ … తన తర్వాత నా కొడుకు మనవడు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నడంటూ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి చరమగీతం పాడి… తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలన్నారు.

అబద్దాలతో పుట్టిన కుటుంబమని, కేసీఆర్ కుటుంబం మాటకారి తనంతో మోసం చేయడం మభ్యపెట్టడం వారి పన్నారు. ఫీజురీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, కేజీ టు పీజీ లాంటి హామీలు ఏమయ్యాయన్నారు. ఇచ్చిన హామీలను మరచి విపరీతమైన దోపిడీకి కేసీఆర్ సర్కారు పాల్పడుతోందన్నారు. 5లక్షల కోట్ల అప్పు చేసి… తెలంగాణలో ప్రతి వ్యక్తి పై లక్షన్నర అప్పు పెట్టారన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ పూర్తిగా దోపిడీకి గురి అవుతుందన్దినారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీకు జీతం ఇచ్చే పరిస్థితి లేదన్న కిషన్ రెడ్డి… చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వరన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రం వ్యాపారాలు చేస్తున్నారని… భూముల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని… తెలంగాణ ప్రజలు మాత్రం గోసపడుతున్నారన్నారు.