ఆ ఇళ్లకు నీళ్లిస్తే అదనంగా వసూలు చేయాలి..
ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని CM రేవంత్ తెలిపారు. హైదరాబాద్ లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ వేస్తే నీళ్లు వచ్చేవి కానీ ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం లేకుండాపోయింది. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చానన్నారు. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పారు. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.