‘యుద్ధం మొదలైతే నేను కూడా పాల్గొంటా’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ‘యుద్ధం మొదలైతే నేను కూడా పాల్గొంటానని, నా అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తా’.. అంటూ తన దేశభక్తిని ప్రకటించారు. ఒక్క పౌరుడు కూడా గాయపడకుండా దాడులు చేసిన మన త్రివిధ దళాలకు మా సెల్యూట్ అన్నారు. పాకిస్తాన్ ప్రపంచంతో పచ్చి అబద్ధాలు చెబుతోందని, యుద్ధం మొదలైతే పాకిస్తాన్ పతనమవుతుందని, పాక్ విచ్ఛిన్నమవడం ఖాయమని మంత్రి జోస్యం చెప్పారు. పీవోకేను ఇండియా స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నామని, పీవోకే నుంచి పాక్‌ను ఖాళీ చేయడమే సమస్యకు పరిష్కారం అని పేర్కొన్నారు. ప్రస్తుత భారత్ జోష్ చూసి పాక్ ఎదుర్కొనే ధైర్యం చేయదని ధీమా వ్యక్తం చేశారు.

