Home Page SliderNational

ఫిట్‌నెస్ లేకపోతే “వీఆర్‌ఎస్(VRS)’ తప్పదు

అస్సాం పోలీసులకు ‘అగ్ని పరీక్ష’ పెట్టింది పోలీస్ శాఖ. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పోలీసులందరూ ఫిట్‌గా ఉండాలని, అధిక బరువు ఉన్నవారికి వీఆర్‌ఎస్ ఆప్షన్ ఇస్తామని హెచ్చరించింది. పోలీసు డ్యూటీలు చేయాలంటే ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. అందుకే వచ్చే మూడు నెలల్లో ఐపీఎస్‌లతో సహా పోలీసులందరూ కరెక్ట్ వెయిట్ ఉండాలని సూచించింది. పోలీస్ బలగాలను బలంగా మార్చే చర్యలు చేపట్టింది. పోలీసులందరి బీఎంఐ (BMI)ను లెక్కకట్టి, ఇప్పటికే 680 మందికి పైగా సిబ్బందిని విధులకు అనర్హులుగా తేల్చింది. వీరందరూ ఆగస్టు 15 లోపు బరువు తగ్గాలని, లేదంటే వారికి, థైరాయిడ్ వంటి సమస్యలు లేకపోతే వారిని ఇంటికి సాగనంపేందుకు స్వచ్ఛందపదవీవిరమణ అవకాశాన్ని ఇస్తామని పేర్కొంది. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారికి ఈ నిబంధన వర్తించబోతోంది. అస్సాంలోని 70 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. కొందరు మద్యానికి అలవాటుపడి, బాగా ఊబకాయులయ్యారు. దీనివల్ల అస్సాం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.