Home Page SliderTelangana

రైతు రుణమాఫీ కాకపోతే ఇలా చేయండి..మంత్రి

తెలంగాణలో ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ డబ్బులను ఇప్పటికే బ్యాంకుల్లో రైతుల ఖాతాలలో జమ చేసింది. అయితే పలువురు ఇంకా రాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. డబ్బు అందని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొందరి ఖాతాలలో డబ్బు పడలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, వారిని వ్యవసాయ అధికారులను కలిసి ఈ నెల 15 తర్వాత సమస్యలను వివరించాలని సూచించారు. తప్పులను సరిచేసి, అర్హులకు రుణమాఫీ జరిగేలా వారు తగిన చర్యలు తీసుకుంటారని తుమ్మల పేర్కొన్నారు.