Home Page SliderTelangana

బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం బీసీలకే అన్న కేంద్రం

హైదరాబాద్: బీసీ సీఎంను ప్రకటించినందుకు బీజేపీ  అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు నిర్వహించారు.

ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, బూర నర్సయ్య గౌడ్, ఆలే భాస్కర్ పాల్గొన్నారు. కులాలు ఏవైనా.. 135 బీసీ కులాలలో చైతన్యం వచ్చింది. రాజ్యాధికారంలో మా భాగం మాకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. బీఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబం తప్ప వేరే వారికి సీఎం, ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓబీసీని సీఎంని చేసిన చరిత్ర లేదు. ముందు ముందు చేసే అవకాశం లేదు. కానీ బీజేపీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రకటించింది. ఇది సాహసోపేతమైన నిర్ణయం. ఎన్నికల కోసం చేసింది కాదు. బీసీల బాగుకోసం చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పోగా మిగిలిన 88 సీట్లలో 40 సీట్లకు పైన ఓబీసీలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. 55 సీట్లు ప్రకటిస్తే 19 ఇచ్చిన చరిత్ర బీజేపీది. ఓబీసీలలో కూడా  చిన్న కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని మోదీ గారు చెప్పారు. ఓబీసీల జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వనున్నారు. ఇంతకుముందు దరఖాస్తు ఇచ్చి దండాలు పెట్టేవాళ్లం.. కానీ ఇప్పుడు ఎవరూ అడగకుండానే బిజెపి ఆ పని చేసింది. బీసీల రాజ్యాధికారం కల నెరవేర్చే చారిత్రాత్మక సన్నివేశం ఇచ్చిన పార్టీ బీజేపీ. అన్ని కులాలు బీజేపీ నిర్ణయాన్ని స్వాగతించాలని కోరుతున్నాం. బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందంటున్నారు, మా ప్రణాళిక మాకు ఉంది. శశభిషలు లేకుండా మద్దతు ఇవ్వండి. మనకోసం మనం మద్దతు ఇచ్చుకోవాలి అని ఈటల రాజేందర్ అన్నారు.