‘అలా అయితే కేసీఆర్‌కు వంద సీట్లు వచ్చేవి’..రేవంత్ రెడ్డి
గాంధీ భవన్‌లోని యువజన కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్నారు. యువనేతలంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. డబ్బుంటే ఎన్నికలలో గెలుపు సాధ్యం కాదన్నారు. కేవలం డబ్బుతోనే రాజకీయాలలో గెలవడం అసాధ్యమైన పని అని, అలా గెలిస్తే కేసీఆర్‌కు గత అసెంబ్లీ ఎన్నికలలో వంద సీట్లు వచ్చి ఉండేవని పేర్కొన్నారు. పార్టీ కోసం పోరాడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికలలో టికెట్లు లభిస్తాయని హామీ ఇచ్చారు.