పర్ ఫ్యూమ్ అతిగా వాడితే అంతే సంగతులు..
సువాసనలు వెదజల్లే పర్ ఫ్యూమ్ వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే వీటి తయారీలో ఆల్కహాల్ సహా వివిధ రసాయనాలను వాడుతుంటారు. కాబట్టి వాటిని నేరుగా చర్మంపై అప్లై చేయడంవల్ల అవి స్వేదరంధ్రాల్లోకి పోయి స్కిన్ అలెర్జీలు, ఇన్ ఫెక్షన్లు దాడి చేయవచ్చు. పర్ ఫ్యూమ్ చర్మంపై తేమను గ్రహించడం కారణంగా స్కిన్ డ్రైగా మారవచ్చు. అంతేకాకుండా అందులోని న్యూరో టాక్సిన్ నాడీవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. తరచుగా వాడితే హార్మోన్ లలో సమతుల్యత దెబ్బతింటుంది. చర్మ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. స్టెరిన్, థాలేట్స్, గెలాక్సోలైడ్స్, గ్లైకాల్స్ వంటి సమ్మేళనాలు పర్ ఫ్యూమ్ లో ఉండటం కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తవచ్చు.

