Home Page SliderTelangana

ప్రజలు శక్తిని ఇస్తే కేసీఆర్ జేజెమ్మతో కూడా కొట్లాడత- ఈటల

గజ్వేల్ నియోజకవర్గం అల్లాపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. ఎమ్మెల్యేను చేసుకొనేది అందుబాటులో ఉండాలి, ఆపదలో ఆదుకోవాలని కానీ ఒక్కనాడన్నా అల్లపుర్ ముఖం కెసిఆర్ చూశారా ? అంటూ ప్రశ్నించారు ఈటల. మన భుముల మీద కన్ను పడింది. కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని పెట్టుకొని  మన భూములు గుంజుకున్నారు. అందుకే ఆయనకు గిఫ్ట్ గా ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పేటి వాడిని దొంగ అంటారు. అలాంటి దొంగలను మన ఊరికి రానిద్దామా ? ప్రజలు శక్తిని ఇస్తే కేసీఆర్ జేజెమ్మతో కూడా కొట్లాడత. నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు రేషన్ కార్డు ఇచ్చే దమ్ములేని ముఖ్యమంత్రివి మా ఊరు ఎలా వస్తావు అని నిలదీయాలని ఈటల పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను ఓడగొడితెనే ఈ బాధలు పోతాయన్నారు ఈటల. పెన్షన్ల వస్తాయి, భూములు దక్కుతాయి, మంచి విద్య వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.