Andhra PradeshHome Page Slider

ఏడాదికి 40 వేల వీసాలే ఇస్తుంటే.. లక్షలాది మందికి టోఫెల్ ఎలా?: నాదెండ్ల

రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్‌ శిక్షణ పేరుతో ఈటీఎస్‌ అనే సంస్థకు ఏటా రూ.వెయ్యి కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

తెనాలి: రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్‌ శిక్షణ పేరుతో ఈటీఎస్‌ అనే సంస్థకు ఏటా రూ.వెయ్యి కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం విద్యావ్యవస్థలో సంస్కరణల పేరిట దోచుకుంటోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏడాదికి 40 వేల మందికి మాత్రమే అమెరికా వీసాలు ఇస్తుంటే.. లక్షలాది మందికి శిక్షణ ఇప్పిస్తామనటం హాస్యాస్పదం. ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలతో చేయించే బస్సు యాత్ర ప్రజలను మోసం చేయడానికేనని విమర్శించారు. ముఖ్యమంత్రి మాత్రం హెలికాప్టర్‌లో తిరుగుతూ ప్రతిపక్షాలను తిట్టడం కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.