కేసీఆర్ నీతిమంతుడైతే కుటుంబ ఆస్తులు బయటపెట్టండి..
ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎస్ నేత కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ నీతిమంతులైతే తమ ఆస్తుల వివరాలను బయటపెట్టాలని సవాల్ చేశారు. గత పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుందని విమర్శించారు. దోపిడీని ప్రశ్నించినందుకే తనను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు. 2014లో కేసీఆర్ అధికారంలోకి రాకముందు కుటుంబ ఆస్తులు ఎన్నిఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో వివరాలు తెలపాలన్నారు. మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకి తెలంగాణపై ప్రేమ లేదన్నారు. వారికి కేవలం అధికారం, డబ్బు సంపాదన మీదే ప్రేమన్నారు. అందుకే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.


 
							 
							