Andhra PradeshHome Page Slider

మళ్లీ జగన్ కనుక గెలిస్తే.. చంద్రబాబు ప్రాణానికి ముప్పే: ఎంపీ గోరంట్ల

బుక్కరాయసముద్రం, శింగనమల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ తిరిగి సీఎం కనుక ఐతే చంద్రబాబు నాయుడు ప్రాణానికి ముప్పే అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం – జాతీయ రహదారిపై నిర్వహించిన సాధికార బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాగా, ఈ సభతో సామాన్యుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు రహదారిని స్టాప్ చేశారు. వాహనాలను మళ్లించినా, దారి తెలియక వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. రెండు గంటల పాటు విద్యుత్ నిలిపివేశారు. అంబులెన్సులు ప్రజల మధ్యన చిక్కుకోగా, పోలీసులు అతి కష్టంమీద వాటిని ట్రాఫిక్ క్లియర్ చేసి ముందుకు వదిలారు.

ఎంపీపీకి దక్కని చోటు – ఈ యాత్రలో దళితులకు ప్రాధాన్యం దక్కలేదు. శింగనమల ఎంపీపీ యోగేశ్వరిని బస్సు ఎక్కనివ్వకుండా పక్కకు నెట్టేశారు. దీంతో ఆమె భర్త జనం మధ్య నుంచి భార్యను పక్కకు పిలిచి టూవీలర్‌పై తీసుకెళ్లారు.