Andhra PradeshBreaking NewsHome Page SliderNewsPolitics

ఏపిలో చేసిన‌ట్లు అర‌బ్‌లో చేస్తే పోలీసుల‌ను ఉరి తీస్తారు

సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ వ‌ర్రా రవీంద్రారెడ్డి ని మీడియా ముందుకు తీసుకొచ్చిన నేప‌థ్యంలో ఏపి డీఐజి చేసిన వ్యాఖ్య‌ల‌కు మాజీ మంత్రి పేర్నినాని కౌంట‌ర్ ఇచ్చారు. వివ‌రాలు వెల్ల‌డించాక …ఇలా చేస్తే అర‌బ్ దేశాల్లో అయితే రాళ్ల‌తో కొట్టి చంపుతారంటూ నిందితుల‌నుద్దేశించి డీఐజి మాట్లాడిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.దీంతో పేర్ని.. డీఐజి వ్యాఖ్య‌ల‌కు ప‌రోక్షంగా మంగ‌ళ‌వారం కౌంట‌ర్ ఇచ్చారు. 2015లో పెట్టిన పోస్టుల‌కు ఇప్పుడు కేసులు క‌ట్టార‌ని,ఇదే విధంగా అర‌బ్ పోలీసులు చేసుంటే ఉరితీసేవార‌ని కౌంట‌ర్ ఇచ్చారు.దీంతో పేర్ని నాని చేసి వ్యాఖ్య‌లు ఏపి పోలీస్ అండ్ పొలిటిక‌ల్ హ‌బ్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.