Home Page SliderTelangana

మా జోలికి వస్తే ఊరుకోం.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలపై కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు సీరియస్ అయ్యారు. మొదటి నుంచి ఆయన అహంకారపూరితమైన ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించి ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులాలను కించపరుస్తూ మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వెలమ కులస్తులపై చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ వెలమ సంఘం
నాయకులు కూకట్ పల్లిలో ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు.