సీఎం పదవి ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేశాను
బాలీవుడ్ నటుడు సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇటీవలే పలు రాజకీయాల్లో ఆఫర్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. ‘నన్ను పిలిచి సీఎం పదవిని, డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. కనీసం రాజ్యసభ సీటునైనా తీసుకొమ్మని చెప్పారు. అయితే నేను వాటన్నింటికి నో చెప్పాను’ అని ఆయన తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో నాకు అంత పెద్ద ఆఫర్లు రావడాన్ని చూసి సంతోషం కలిగింది. ఈ ప్రపంచాన్ని మార్చేందుకు నాకు అవకాశాన్ని కల్పిస్తామని చెప్పినందుకు గర్వంగా అనిపించింది’ అని సోనూ సూద్ చెప్పుకొచ్చారు. ‘రాజకీయాల్లోకి వెళ్లాలని నేనైతే అనుకోవడం లేదు. వాటిలోకి వెళ్తే నా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. స్వేచ్ఛను కోల్పోకుండా ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.