చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు
తనని కొందరు చంపాలని చూస్తున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని తెలిపారు. ‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు. అందరికోసం పనిచేస్తున్న.. పని చేస్తూనే ఉంటా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయ్. వేలాది మంది గ్రూప్ 1 అభ్యర్ధులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నరు. వారిపై పై పోలీసు దాడులు చేయడం బాధాకరం. పరిపాలన చాతకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయండి. వేలమందిని ఎందుకు కొడుతున్నారు?” అని ప్రశ్నించారు.