అన్నొచ్చాడంటే….వస్తారంతే!
చెప్పాడంటే చేస్తాడంతే…ఇది పాట.అన్నొచ్చాడంటే వస్తారంతే…ఇది మాట.ఇది అలాంటి ఇలాంటి ఒట్టి మాట కాదు…నిజమైన మాట. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడుంటే జనం అక్కడుంటారు అని చెప్పడానికి ఇవాళ జరిగిన సంఘటన ప్రత్యక్ష ఉదాహరణని చెప్పొచ్చు.కర్నూలులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు జగన్ వచ్చాడు.దీంతో గంటల తరబడి జగన్ కోసం ప్రజలు,యువత ఎదురు చూశారు.నిరీక్షల గడువు పెరుగుతున్నా…ఒంట్లో అసహనపు ఛాయల్ని మాత్రం దరి చేరనీయకుండా తమ అభిమాన నేత కోసం పడిగాపులు గాశారు.ఒక్కసారి జగన్ వచ్చి ఇలా అభివాదం చేశాడో లేదో వాళ్ల నిరీక్షణ, అసహనం అన్నీ మటుమాయమయ్యాయి.అంత క్రేజ్ ఉన్న నాయకుడు ఈ సౌత్ ఇండియాలో లేడనే చెప్పాలి. అధికారం ,ప్రతిపక్షంతో సంబంధం లేకుండా నేమ్ బ్రాండ్ సంపాదించుకున్న పొలిటికల్ స్టార్ ఒక్క జగన్ మోహన్ రెడ్డి అని చెప్పడంతో ఎలాంటి సందేహం లేదు.