Home Page SliderTelangana

4 కోట్ల మందికి హీరో అయితే.. ఓట్లు ఎందుకు వేయలేదు..

కేసీఆర్ 4 కోట్ల మందికి రియల్ హీరో అయితే.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు ఎందుకు వేయలేదన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. హైదరాబాద్ లో ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు.దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో 100 శాతం పక్కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను చేపట్టింది. బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు ఆఫీషియల్ రికార్డు లేదు. వివరాలను కనీసం అసెంబ్లీలో కూడా పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే సరైందే.. ప్రజలతో మమేకమైన వాడే నిజమైన నాయకుడు అవుతాడు. డైవర్ట్ పాలిటిక్స్ కోసం కులం, మతం పై చర్చ పెట్టడం సరైంది కాదు.’ అని గుత్తా తెలిపారు.