“వస్తే పదిమందితో తిరిగొస్తా”..రియల్ హీరో
ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే హెలికాఫ్టర్ తేలేక చేతులెత్తేసిన స్థితిలో, ధైర్యంగా ముందుకెళ్లి “వస్తే పదిమందితో తిరిగొస్తా” అని చెప్పి, వెళ్లిన జేసీబీ డ్రైవర్ సుభాన్‌ఖాన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మున్నేరు వాగు వంతెనపై పోటెత్తితే, ధైర్యంగా “పోతే ఒక్కడినే పోతా” అంటూ వారిని కాపాడడానికి ముందుకెళ్లారు సుభాన్. ఆయన ధైర్యసాహసాలను బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ట్విటర్ వేదికగా కొనియాడారు. ప్రమాదానికి ఎదురెళ్లిన నీకు సలాం అంటూ ఆయనకు ఫోన్ చేసి మరీ అభినందించారు.