ఫ్రీ కరెంట్ ఇస్తే.. బీజేపీ తరుఫున ప్రచారం చేస్తా..
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అందిస్తే ఆ ఎలక్షన్స్ లో బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని ఛాలెంజ్ చేశారు. ఢిల్లీలో ఇవాళ నిర్వ హించిన ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో కేజీవాల్ ప్రసంగించారు. ‘హర్యానా, జమ్మూకశ్మీర్ లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు త్వరలోనే కూలిపోతాయి. మొదటి ఇంజిన్ జూన్ లో విఫలమైంది, జార్ఖండ్, మహారాష్ట్రలోనూ మరో ఇంజిన్ ఫెయిలవడం ఖాయం’ అని వ్యాఖ్యానించారు.

