Home Page SliderNational

ఈగలు వాలిన ఆహారం తింటే…

ఈ కాలంలో ఈగలు తిరగడం మామూలే. వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి. వాటి శరీరం వ్యాధులను కలిగించే క్రిములకు నిలయం. ఈగలు వాలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితులలో తినకూడదు. ఎందుకుంటే అవి దేనిమీదైనా వాలినప్పుడు వాటి కాళ్లకు అది అంటుకుంటుంది. వీటిలో లక్షల సంఖ్యలో బాక్టీరియా ఉంటుంది. ఈగలు వాలిన ఆహారం తిన్నవాళ్లకు కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈగలు చెత్త కుప్పల మీద వాలి, మళ్లీ ఆహారంపై వాలినప్పుడు బాక్టీరియా ఆహారంలో ప్రవేశిస్తుంది. దీనితో ఆ ఆహారం తిన్నవాళ్ళు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఈగలు వాలకుండా ఆహారాన్ని పరిశుభ్ర ప్రదేశంలో పెట్టుకోవడం, జల్లెడ లాంటి వస్తువులు ఆహారంపై మూతలా పెట్టడం వంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.