క్రెడిట్ కార్డు ఇలా వాడితే కొంప మునిగినట్లే…
కొన్ని రకాల లావాదేవీలు మనల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు. క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలు కొన్ని కొంపముంచుతాయి. కొన్నిరకాల లావాదేవీలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ దృష్టిలో పడతాయి. అవేంటంటే క్రెడిట్ కార్డుపై విదేశీ ప్రయాణ టికెట్లు కొనుగోలు చేసినట్లయితే, దాని డేటా ఐటీ శాఖకు చేరుతుంది. ఒకే సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే కూడా ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుండి నోటీసులు వచ్చే అవకాశాలున్నాయి. బ్యాంకులో రూ. 10 లక్షలకు మించి నగదు డిపాజిట్ చేయకూడదు. క్రెడిట్ కార్డుపై రూ.2 లక్షలకు మించి సంవత్సరంలో ఖర్చు చేస్తే, రూ. లక్ష కంటే నగదు రూపంలో క్రెడిట్ కార్డు చెల్లింపులు జరిపితే కూడా ఐటీ కట్టాల్సి వస్తుంది. అలాగే క్రెడిట్ కార్డుపై చెల్లించాల్సిన బకాయి కాలపరిమితి లోగా కట్టకపోతే భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
Breaking news: నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట