బై మిస్టేక్ కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారుల చేతివాటం తప్పదు: కేసీఆర్
నిర్మల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తారు.. వైకుంఠపాళీలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రైతు బంధుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నోరకాలుగా మాట్లాడుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్. రైతులు అంతకుముందు కన్నీరు పెట్టుకునేవారు. లంచాలు ఇచ్చి ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్ చేయించుకునే పరిస్థితి. ఇప్పుడు కరెంట్‌ను 24 గంటలు దొరకబుచ్చుకున్నాం. నిర్మల్ నియోజకవర్గంలో 15 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నారు. వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు తెచ్చుకున్నారు. 24 గంటల కరెంట్‌తో పంటలు పండిస్తున్నారని కేసీఆర్ తెలిపారు.