Andhra PradeshHome Page Slider

చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థకు తిలోదకాలే: కొడాలి నాని

ఏపీ: చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని అన్నారు. జన్మభూమి కమిటీలు మళ్లీ పుట్టుకు వస్తాయని చెప్పారు. చంద్రబాబు పిట్ట కథలు వినడానికి ఎవరూ ఇక్కడ సిద్ధంగా లేరని అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ వాగ్దానాలే అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబుకు రాజకీయ సమాధే అని పేర్కొన్నారు. ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకుని పొత్తు పెట్టుకున్నారని అన్నారు.