బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే సీఎంగా బీసీని నిలబెట్టగలరా?: బండి
కరీంనగర్: బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. కరీంనగర్‌లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని తమ పార్టీ చెప్పిందన్నారు. కేవలం బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా పేదల రాజ్యం రావాలని కోరుకుంటున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే బీసీని లేదా గతంలో హామీ ఇచ్చినట్లుగా దళితుడిని సీఎంగా చేయగలరా? అని కేసీఆర్‌ను ఉద్దేశించి బండి సంజయ్ గట్టిగా అడుగుతున్నారు.