Home Page SliderTelangana

బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్ సీఎం?

తెలంగాణ: 33 బీసీ, కుల సంఘాలతో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బీసీ వర్గాలంతా కలిసి బీజేపీని గెలిపిస్తే ఈటలను సీఎం పదవి వరిస్తుందని మోడీ పేర్కొన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, బీసీలను గెలిపించుకోవాలని మోడీ ఆయా సంఘాలకు సలహా ఇచ్చారు. అటు ఎల్బీ స్టేడియంలో మోడీ తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. తర్వాత జరిగిన ర్యాలీలోనూ ఈటలను పిలిచి మోడీ పక్కన నిల్చోబెట్టుకున్నారు.