Home Page SliderNational

అస్తమించిన ఐకానిక్ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ

పాపులర్ అయిన “బినాకా గీత్ మాలా” ప్రోగ్రాం వెనుక ప్రముఖ వాయిస్ అమీన్ సయానీ 91 సంవత్సరాల వయసులో మరణించారని ఆయన కుమారుడు రాజిల్ సయానీ తెలిపారు. మంగళవారం రాత్రి అమీన్ సయానీకి గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆయన చనిపోయారు. హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో రాత్రి 7:00 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు అని రజిల్ సయానీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాతో అన్నారు. రేడియో సిలోన్‌లో ‘నమస్కార్ భాయియోం ఔర్ బెహ్నో, మెయిన్ ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్’ అనే అమీన్ సయానీ పరిచయం ఇప్పటికీ శ్రోతలపై చెరగని ముద్ర వేసింది. డిసెంబర్ 21, 1932 న ముంబైలో బహుభాషా కుటుంబంలో ఆయన జన్మించాడు.