హైదరాబాద్లో ఓటేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుష్పకు ముందు తర్వాత అన్నట్టుగా ఇండియన్ మూవీ స్టార్ గా ఎదిగిన బన్నీ రాకతో ఎన్నికల కేంద్రంలో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా అందరూ పెద్ద ఎత్తున ఓటు వేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.


