Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు షాక్

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. గతంలో పోలీసులకే సవాల్ విసిరిన అతడిని, తాజాగా మరో నాలుగు కేసులకు సంబంధించి 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతినిచ్చింది. విదేశాల్లో ఉంటూ వందకు పైగా పైరసీ సైట్లను నడిపి సుమారు రూ. 20 కోట్లు ఆర్జించినట్లు, ఆ డబ్బుతో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. విడాకుల విషయంపై చర్చించేందుకు ఫ్రాన్స్ నుండి హైదరాబాద్ వచ్చిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా నిఘాతో అరెస్ట్ చేశారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ విచారణ ద్వారా పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న పూర్తి ఆర్థిక లావాదేవీలు, ఇతర కీలక వివరాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు.