International

నా కష్టం పగవారికి కూడా రావొద్దు.. ట్విట్టర్ కొన్నాక సీన్ మారిపోయింది..!

ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ట్విట్టర్‌  కొనుగోలుతో తాను ఎదుర్కొన్న బాధలను పంచుకున్నారు. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి దాదాపు 3 నెలలు గడుస్తోంది.

అయితే అప్పటి నుంచి ట్విట్టర్‌కు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆయన ట్విట్టర్‌ను ఆర్ధిక కష్టాల నుంచి గట్టు ఎక్కించేందుకు పలు రకాల చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆ సంస్థలో సగానికి పైగా ఉద్యోగులును తొలగించారు. అంతే కాకుండా ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులకు కల్పించిన సౌకర్యాలను,సదుపాయాలను ఆయన కుదించారు. మరోవైపు టెస్లా,స్పేస్‌ఎక్స్ బాధ్యతలు కూడా సమర్దవంతంగా నిర్వర్తించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి కష్టం పగవారికి కూడా రాకూడదని ఆకాంక్షిస్తున్నట్లు ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.