పదవి ఇవ్వకపోతే.. గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేస్తా
తనకు నామినేటెడ్ పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుని ధర్నా చేస్తానంటూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ మహిళగా, ముదిరాజ్ బిడ్డగా పదవికి అన్ని రకాల అర్హతలు తనకు ఉన్నాయన్నారు. ఇవాళ ఆమె గాంధీ భవన్ లో మాట్లాడుతూ…తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారని, నామినేటెడ్ పదవైనా ఇవ్వకుంటే గాంధీభవన్ వద్ద ధర్నా చేసి పీసీసీ చీఫ్ ను అడ్డుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.పార్టీ కోసం తాను ఎంతో శ్రమిస్తున్నానని, పార్టీలో తనకు గౌరవం దక్కకపోవడంపై గతంలోనే ఆమె గాంధీ భవన్ వేదికగా కంటతడి పెట్టుకున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీకి హై కమాండ్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

