కేసీఆర్ అనే మొక్కను ఈ గడ్డపై మళ్లీ మొలవనివ్వను..
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలవనివ్వనని శపథం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ తెచ్చిన బెల్ట్ షాపులు ఇప్పటికి ఊరురా ఉన్నాయన్నాయని అన్నారు సీఎం రేవంత్.. రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకైక అధ్యక్షుడు కేసీఆర్ అని.. ఫుల్ బాటిల్ కు బ్రాండ్ అంబాసిడరని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్ జనాన్ని మత్తులో ముంచెత్తాడని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన- ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.