నన్ను ఇరికించిన వారిని వదిలిపెట్టను:చెవిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా దుమారం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో నిందితులు మరోసారి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టు బయట హల్‌చల్ చేశారు.కోర్టు నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను మద్యం తాగలేదు, అమ్మలేదు. ఈ కేసులో నాకు ఎలాంటి పాత్ర లేదు. నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. నన్ను ఇరికించిన వారిని వదిలిపెట్టను. పైన దేవుడున్నాడు.. అన్నీ చూసుకుంటాడు” అని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయనను పోలీసులు జీపులో విజయవాడ జైలుకు తరలించారు.ఇక ఈ కేసులో నిందితుల రిమాండ్‌ను న్యాయస్థానం ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. గత రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సిట్ అధికారులు నిందితులను కోర్టుకు తీసుకొచ్చారు. ధనుంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీలు ఆబ్సెంట్ పిటిషన్ వేయగా, మిగిలిన 10 మందిని నేరుగా కోర్టులో హాజరుపరిచారు.విచారణ అనంతరం సిట్ అధికారులు వారిని మళ్లీ జైళ్లకు తరలించారు. ఎంపీ మిథున్‌రెడ్డిను రాజమండ్రి సెంట్రల్ జైలుకు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని విజయవాడ జైలుకు తరలించారు. దీంతో మద్యం కుంభకోణం కేసు మళ్లీ వేడి పుట్టిస్తోంది.

