Andhra PradeshHome Page Slider

“నేను పార్టీని విడిచిపెట్టను”:బుట్టా రేణుక

ఏపీలో కూటమి గెలుపుతో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కాగా చాలామంది వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకునేందుకు ఇప్పటికే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాను కూడా టీడీపీలో చేరుతున్నానంటూ వస్తోన్న వార్తలను వైసీపీ నేత బుట్టా రేణుక ఖండించారు. వైసీపీని వీడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. జగన్‌పై మాకు నమ్మకం ఉందన్నారు. కాబట్టి ఆయన వెంటే నడుస్తామన్నారు. మరోవైపు వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలు కూడా వదంతులే అన్నారు. కాగా మాకు ఏపీలో 40 శాతం మంది ప్రజల మద్దతు ఉందని అందరు గుర్తుంచుకోవాలన్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్‌కి అసలు ఓటింగే లేదు.అలాంటిది ఆ పార్టీలో వైసీపీని ఎలా విలీనం చేస్తారని బుట్టా రేణుక ప్రశ్నించారు.