నా జీవితంలో ధోనిని ఎన్నటికీ క్షమించను
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనిపై విరుచుకుపడ్డాడు. గతంలో భారత్ తరపున 7 మ్యాచ్‌లు ఆడిన యోగరాజ్, తన కుమారుడు యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని ఆరోపిస్తూ, బహిరంగ వేదికపై విమర్శిస్తూనే ఉన్నాడు. ధోనీని జీవితంలో ఎప్పటికీ క్షమించలేనని చెప్పాడు. యోగరాజ్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “ఎంఎస్ ధోనిని నేను క్షమించను. అద్దంలో ముఖం చూసుకోవాలి. చాలా పెద్ద క్రికెటర్, కానీ అతను నా కొడుకుని ఏం చేసాడు, ఇప్పుడు అన్నీ బయటకొస్తున్నాయి. జీవితంలో ఎప్పుడూ నేను రెండు పనులు చేయలేదన్న ఆయన, మొదటిది, నా కోసం తప్పు చేసిన ఎవరినీ క్షమించలేదు, రెండోది, నా జీవితంలో వారిని కౌగిలించుకోలేదు, అది నా కుటుంబ సభ్యులైనా, నా పిల్లలైనా కావొచ్చు” అని యోగరాజ్ చెప్పాడు.

యోగరాజ్ ధోనిపై నేరుగా విరుచుకుపడటం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, ధోని తప్పుడు నిర్ణయాలతో CSK ఓడిపోయిందంటూ విమర్శించాడు. యువరాజ్‌పై ధోనీ అసూయతో ఉన్నాడని ఆరోపించాడు. “CSK IPL 2024లో ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయారు? మీరు ఏది విత్తితే, అదే కోసుకుంటారు. ICC అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న యువరాజ్ సింగ్‌కు హ్యాట్సాఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.! ఈ అసూయ ధోనీ, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ధోని, యువరాజ్‌కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం CSK విఫలమవడానికి కారణం ధోనీయే” అంటూ యోగరాజ్ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినప్పటికీ, 43 ఏళ్ల ధోనీ ఇప్పటికీ IPLలో చురుకుగా ఆడుతున్నాడు. అయితే, లెజెండరీ స్టార్ బ్యాట్స్‌మెన్ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాల్గొంటాడా? లేదా ఆయన రోల్ మారతాడా అన్నది చూడాలి.

