‘ఐ కిల్ యూ’ అంటూ భారత క్రికెట్ హెడ్ కోచ్‌కు బెదిరింపులు
‘ఐ కిల్ యూ, మిమ్మల్ని చంపేస్తామంటూ’ భారత క్రికెట్ హెడ్ కోచ్ గంభీర్‌కు రెండు మెయిల్స్ వచ్చాయి. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బెదిరింపులకు కారణం అతడు పహల్గాం దాడి కేసులో స్పందిస్తూ పోస్టు పెట్టడమే అని తెలుస్తోంది. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కోసం ప్రార్థిద్దాం. దానికి బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందంటూ గంభీర్ పోస్టు పెట్టారు. ఈ బెదిరింపులు ఐసీస్ కశ్మీర్ నుంచి వచ్చినట్టు భావిస్తున్నారు. దీనిపై ఢిల్లీ సైబర్ సెల్ ఇవి ఎక్కడ నుండి వచ్చాయి, ఎవరు పంపారనే విషయంపై విచారణ చేపట్టారు. తనకు భద్రత కల్పించాలని గంభీర్ పోలీసులను కోరారు.