Home Page SliderNational

“ప్రధాని మోదీని చంపేస్తా అంటూ” బెదిరింపు కాల్

ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖలకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా చంపేస్తామంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి  పోలీస్ కంట్రోల్ రూమ్‌కు  ఫోన్ చేసి మోదీని చంపుతానని  బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నెంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని ట్రేస్ చేశారు. కాగా అతడు ఢిల్లీకి చెందిన 48 ఏళ్ల హేమంత్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు..అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా హేమంత్ 6 ఏళ్లుగా నిరుద్యోగిగా ఉన్నాడని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసైన అతను ఈ బెదిరింపు కాల్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.