Home Page SliderNationalPolitics

‘ఆయన హయాంలో మంత్రిగా పనిచేయడం నా అదృష్టం’..చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పార్లమెంట్ సభ్యునిగా, పర్యాటక శాఖ సహాయమంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహానుభావుడి హయాంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఉన్నత విద్యావంతుడని కొనియాడారు. రెండు సార్లు భారత ప్రధానిగా పనిచేసి, దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.