నాకు పార్టీలో గుర్తింపు కావాలి:బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై హైకమాండ్‌తో చర్చించేందుకు ఆయన ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. కాగా ఇటీవల తెలంగాణా బీజేపీలో అధ్యక్ష పదవిలో మార్పులు జరుగుతాయి అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తాను ఎందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాలేనని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తనకు పార్టీలో సరైన గుర్తింపు కావాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. తాను 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో పనిచేస్తున్నానన్నారు. ఈ మేరకు తనకు తెలంగాణా బీజేపీలో ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవి,ఫ్లోర్ లీడర్ పదవుల్లో ఏదైనా కీలక పదవి ఇవ్వాలని ఆయన పార్టీని కోరుతున్నారు. అయితే దీనిపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సివుంది.

