News

జీవితంలో తొలిసారి BJPకి ఓటేశా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేశానని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది అన్నారు. తన జీవితంలో తొలిసారిగా బీజేపీకి ఓటు వేశానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ విడియో కూడా రిలీజ్ చేశారు. ఓటు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. ‘కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు సెక్యులర్ ముసుగులో ముస్లిములను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్నారు. హిందూ ముస్లిములు ఏకమవ్వకుండా విడదీస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందరినీ కలిపి, అభివృద్ధి చేసేవాళ్లే సెక్యులర్స్ అవుతారని పేర్కొన్నారు.