ఉద్దానమా ఊపిరి పీల్చుకో:సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో నూతనంగా నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశానన్నారు. 2018లో ఇచ్చిన మాట ప్రకారమే ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను తీసుకొచ్చామన్నారు.కాగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దేశానికే ఆదర్శం కావాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో 375మంది డాక్టర్లు,అనేకమంది సిబ్బంది పనిచేయబోతున్నారన్నారు. అయితే ఈ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా త్వరలోనే రాష్ట్రంలో కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో కిడ్నీ రోగులకు రూ.10,000 పెన్షన్ ఇస్తన్నది మన ప్రభుత్వమే అని జగన్ స్పష్టం చేశారు.అంతేకాకుండా మందులు ఏకంగా ఇంటికి తీసుకువచ్చి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ వెల్లడించారు.దీంతో ఇకపై ఉద్దానం అంటే ఉద్యానవనం అని సీఎం జగన్ పేర్కొన్నారు.


 
							 
							