బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తానని…
ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ, ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరి దగ్గర రూ.700 వసూలు చేశాడు. ఉప్పల్ భగయత్‌లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు చేశాడు. ఆయన, బట్టతల ీద షాంపు వేసి, మూడు నెలల తర్వాత వెంట్రుకలు మొలుస్తాయని బాధితులకు చెప్పాడు. దీని కోసం ఇన్‌స్టాలో కూడా ప్రచారం చేశాడు. దీంతో అతని స్టాల్ పై జనం ఎగబడ్డారు. స్టాల్ వద్దకు భారీగా జనం చేరుకోవడంతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు.. పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.